సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహా అద్భుతాలకు నిదర్శనమైన శ్రీ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరచుకుంది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. అక్కడ చీకటిగా ఉన్నప్పటికి స్వామివారి నగలను గుర్తించి వాటిని బయటకు తీసుకోని వచ్చి ప్రత్యక గదిలో పెట్టి వాటి విలువ లెక్కిస్తారని తెలుస్తుంది.1978లో ఈ భాండాగారంలో సంపదను లెక్కించేందుకు 72 రోజుల సమయం పట్టిందని సమాచారం. అయిన పూర్తిగా లెక్కించలేక మరల మూసివేశారు. తాజా ఆసక్తికర సమాచారం ఏమిటంటే.. నేటి మధ్యాహ్నం ప్రత్యేక పూజలు అనంతరం ఈ రత్నభాండాగారాన్ని మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. స్వామివారి కానుకలు గా అనేక వజ్ర రాశులకు వందల కేజీల బంగారం వెండి ఉందని భావిస్తున్న మూడో గదిలోకి 11 మందితో కూడిన ఒక బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరు భారీ పెట్టెలను భాండాగారంలోకి తీసుకెళ్లారు.అయితే తలుపులను తెరువగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్కు తరలించారు. అక్కడ డాక్టర్ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఆ 3వ గదికిగదికి నాగబంధం ఉండటంతో విషనాగులు ఉండే అవకాశం ఉందని డాక్టర్స్ ను మందులతో పాటు పాములు పట్టేవారిని కూడా వెంటబెట్టుకొన్నారు.
