సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిందని భావిస్తున్న అవినీతి ఫై దర్యాప్తు లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హైకోర్టు విధించిన స్టే ను సుప్రీం కోర్ట్ తాజాగా ఎత్తివేయండం తో ఇక చంద్రబాబు అరెస్ట్ తరువాయి అంటూ వైసిపి నేతల జోస్యంతో పాటు తెలుగు రాష్ట్రాలలో పలు మీడియా చేనెల్స్ లో అదేపనిగా వార్త కధనాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కక్ష సాధింపుతో టీడీపీ నేతలపై పెట్టాల్సిన కేసులన్నీ పెట్టిన తర్వాత కొత్తగా వైసీపీ ప్రభుత్వం సిట్‌ వేసినంత మాత్రాన ఏమవుతుందని మాజీ ప్రశ్నించారు. ‘ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ నెట్‌, అస్సైన్డ్‌ భూములు, అవుటర్‌ రింగ్‌రోడ్డు, మార్గదర్శి వంటి అనేక అంశాలపై కేసులు పెట్టేశారు. కొత్తగా సిట్‌ వేసి ఏం చేస్తారు? చేయాల్సిన విచారణలు అన్నీ చేసేశారు. సిట్‌ లేకపోయినా ఇతర ఏజెన్సీలతో కేసులు నమోదు చేశారు. ఈ రాష్ట్రంలో మరెవరూ వ్యాపారం చేయకూడదన్నట్లు టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. రాజమండ్రి లో చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి అప్పారావు, వాసుపై కేసు పెట్టారు. మీ పార్టీ వారిపై ఎవరిపై అయినా కేసులు పెట్టారా?’ అనిప్రశ్నించారు. అవినాశ్‌రెడ్డి అరెస్టు కాకుండా ఉండటానికి అనేక వందలసార్లు కోర్టులకు వెళ్లారని, తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తమిళ సినీ హీరో రజనీకాంత్‌కు ఈ రాష్ట్రానికి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రాష్ట్రంలో కిమ్‌ పాలన నడుస్తోందా? ఆయన ఏం తప్పు మాట్లాడారు? మీ పాలన బాగోలేదన్నారా? ఎన్టీఆర్‌తో తన అనుబంధం చెప్పారు. ఒక విలేకరి సూటిగా జనసేన తో పొత్తు ఉంటుందా? ఉండదా? అని ప్రశ్నకు అడిగిన జనసేన తో పొత్తులపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చంద్రబాబు అనడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *