సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ కు మద్దతుగా ఇరాన్‌ఫై అమెరికాదాడి నేపథ్యంలో ఇది కొత్త భౌగోళిక రాజకీయ అనిశ్చితికి దారితీసింది. తమపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ తమ పరిధిలోని హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేత ప్రకటనతో అమెరికా తో పాటు ఆ మార్గం ద్వారా రష్యా నుండి ఇరాక్, సౌదీ అరేబియా,ఇరాన్ నుండి కూడా పెట్రోలు దిగుమతి చేసుకొనే భారత్ కు కూడా పెట్రోలు దిగుమతి ఖర్చులు ఇకపై పెనుభారం కానున్నాయి.నేటి సోమవారం ధరల్లో ఏకంగా 2.8 శాతం పెరుగుదల కనిపించిందిఅయితే నిరవధికంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివెయ్యలేదని ఆలా జరిగే అవకాశం లేదని, అలాంటి చర్య అమెరికా లేదా యూరప్ కంటే ఇరాన్, దాని మిత్రదేశాలయినా చైనా ఇండీయా తదితర దేశాలకు ఎక్కువ హాని కలిగిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారత్ లో స్టాక్ మార్కెట్ నేటి సోమవారం ఉదయం భారీ పతనంతో ప్రారంభం అయ్యింది. ఒక దశలో BSE సెన్సెక్స్ 81,617 పాయింట్ల వద్ద ట్రేడవుతూ 906 పాయింట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. Nifty50 ఇండెక్స్ 24,887 స్థాయిలో ఉంది. ఇది 265 పాయింట్లు పడిపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 414 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 351 పాయింట్లు దిగజారింది. మరోవైపు Nifty SmallCap సూచికలు కూడా నష్టాలు నమోదు చేశాయి.
