సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముందస్తు లోక్ సభ ఎన్నికలకు మోడీ సర్కార్ సిద్ధం అవుతుందని తాజా పరిణామాలు బట్టి విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో .. తాజాగా వంటిటి గ్యాస్ ధర మోదీ ప్రభుత్వం ప్రజలకు కానుక పేరుతో తగ్గించిన గ్యాస్ ధరలు ప్రారంభం మాత్రమే. మరికొద్దిరోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించే అవకాశాలు స్వష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా దిగొచ్చినా.. రష్యా నుండి రాయితీ ధరలలో ముడి పెట్రోల్ లభించిన సామాన్యునికి ఒరిగింది ఏమిలేదు సరికదా కరోనా సమయంలో ఒక దశలో లీటర్ పెట్రోల్ 120 కు చేరుకొని దేశంలోని అన్ని ధరలకు కారణమైంది. కానీ తరువాత దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ సమయంలో లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.5 తగ్గించింది. ఇప్పుడు మరోసారి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ( వాటితో పాటు లోక్ సభకు ముందస్తు ఎన్నికలు?) లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో రూ.5- 7 వరకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
