సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో యుద్ధ ఉద్రిక్తతలు కాస్త తగ్గినప్పటికీ ముడిచమురు ట్యాంకులు తగలబెట్టేసుకోవడంతో నేపథ్యంలో రష్యాలోని ముడి చమురుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. భారత దేశంలో ఇంధన కొరత అధిగమించడానికి . రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తోంది. తాజాగా రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్టు ‘బ్లూమ్బర్గ్’ తన కథనంలో పేర్కొంది (Indiaప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లోని బ్రెంట్ క్రూడాయిల్ ధర కంటే, బ్యారెల్కు 5-15 డాలర్లు అధికంగా చెల్లించి మరీ భారత రిఫైనరీలు ఈ కొనుగోళ్లు జరిపినట్టు సమాచారం.అమెరికా తో భారత్ ట్రేడ్ ఒప్పదం నేపథ్యంలో రష్యా తో బారి డిస్కౌంట్ చమురు కొనుగోలు వదులుకోవలసి వచ్చింది. ఇప్పడు అదే అమెరికా రష్యా నుండి చమురు కొనుకోమని చెప్పడం .. రష్యా మాత్రం ధర పెంచేసింది. గత ఫిబ్రవరిలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ముడి చమురుతో పోల్చుకుంటే ఈ కొనుగోళ్లు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
