సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,సోమవారం కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది భారతదేశవ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 8, 2025) పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 13 కు పెంచుతామని, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 కు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. పరోక్షంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ద్రోహదం చేస్తుంది. రవాణా చార్జీలు పెరిగి పరోక్షంగా దేశంలో అన్ని ప్రజా ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోలియం రంగంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కంపెనీలకు. ఎక్సైజ్ సుంకం పెంపు అంటే పరోక్షంగా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ అధిక ఖర్చులు పెరిగి , ఇది ఇంధన డిమాండ్ తగ్గడానికి దారితీస్తుంది ఇది BPCL, HPCL మరియు IOC వంటి చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్స్ స్టాక్స్ సూచీల పతనానికి దారిచూపిందీ
