సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేటి గురువారం సాయంత్రం భీమవరం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఆయన తండ్రి , మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు ను మోషేను రాజు కలసి అయన ఆరోగ్య పరిస్థితి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భముగా కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ.. పెద్దలు గ్రంధి వెంకటేశ్వర రావు ను నా రాజకీయ గురువు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని, అయన అస్సిసులు కోరి ఇక్కడకు వచ్చానని అన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో మర్యాదపూర్వకంగా కొద్దీ సేపు ముచ్చటించడం జరిగింది. భీమవరం పట్టణ శివారులో ఉన్న విస్సాకోడేరు గ్రామం లో ఢిల్లీలో బీజేపీ తెలుగురాష్ట్రాల సమన్వయ కర్త పురేళ్ళ రఘురామ్ స్వగృహంలో నిర్వహిస్తున్న శ్రీ ఆభయాంజనేయ స్వామి వారి లక్ష తమలపాకులు పూజ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు పాల్గొనడం జరిగింది.
