సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ సినీ ప్రియులంత ఆసక్తిగా చూస్తున్న సినిమా ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా కు కాస్త అటుఇటుగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే జేమ్స్ కామెరూన్ దర్శ కత్వం వహించిన ఈ విజువల్ వండర్ ను 3డి లో చూడటానికి తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్య క్తి మృ తి చెందాడు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళా డు. ఉద్వేగభరిత సన్నివేశాలు చూస్తూ సినిమా మధ్య లో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. దీంతో శ్రీను తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *