సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరో రాంచరణ్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi) సినిమాకు సంబంధించి మొదటి సాంగ్ వీడియో నేడు, శుక్రవారం సోషల్ మీడియాలో విడుదల చేసారు మైత్రి మూవీస్ మేకర్స్. పాటలో అద్భుతమైన లొకేషన్స్ బ్యాక్ గ్రౌండ్ వాటి ముందర రాంచరణ్ అదిరిపోయే స్టెప్స్ హీరోయిన్ జాహ్నవి వయ్యారాలు నడక.. అన్ని అదుర్స్. అయితే పేరుకు ఏ ఆర్ రెహమాన్ సంగీతమే కానీ చికిర చికిర .. పాట మాత్రం చాల లోస్టాండెడ్ మ్యూజిక్ తో 4 నిమిషాల పాట ఎదో అయ్యిందనిపించింది. పాట వినగా వినగా’ చికిర.. చికిర‘ క్యాచీగా జనాలకు పట్టేస్తుందనుకొన్నారో ఏమో? కానీ నిజంగా ఒక లయ పాడు లేకుండా చేసారు. మిగతా పాటలయిన కాస్త శ్రద్ద పెడితే మంచిది. .. ఈ వీడియో సాంగ్లో చాల కాలంగా ‘పస’ తగ్గి ‘నస’ పెరిగిన సంగీత దర్శకుడు రెహమాన్, గాయకుడు చౌహాన్, దర్శకుడు బుచ్చిబాబు కూడా కాసేపు కనిపించి అలరించారు.
