సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలోని ప్రభల ఉత్సవాలలో టీడీపీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మధ్య హోరాహోరీ రాళ్ల యుద్ధం జరిగింది. దానితో ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకొన్న పోలీసులు లో 4గురికి రాళ్ల దెబ్బలతో గాయాలు అయ్యాయి. ప్రభల ఉత్సవాల భద్రతా నిర్వహణపై అనుభవం ఉండి అక్కడ ప్రత్యేక డ్యూటీకి వచ్చిన కోనసీమ జిల్లా జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్‌సీపీ స్థానిక నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. టీడీపీకి , వైసీపీ పార్టీలకు చెందిన ప్రభలు ఒకేసారి సెంటర్ కు రావడంతో ఇరువురు నేతలకు వాదన పెరిగి మొదట వాటర్ ప్యాకెట్లు బాటిళ్లు తో మొదలయిన యుద్ధం రాళ్లు విసురుకోవడం వరకు వెళ్లి తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది. ఇది గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లారు. దీంతో పోలీసు సిబ్బంది, ప్రజలకు కూడా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేశారు.
