సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో ఇటీవల అంతరాష్ట్ర దొంగల కదలికపై పోలీసులు నిఘా పెట్టారు. దీనిలో భాగం దొంగతనానికి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని డీఎస్‌పీ రవి మనోహరచారి తెలిపారు. ఆయన పెనుగొండ పోలీసు స్టేషన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నెల 27వ తేదీన పెనుగొండ మండలం వెంకట్రామపురం ఆర్టీసీ బస్సులో బంగారం, రెండు లక్షల నగదు, 850 గ్రాములు బంగారం ? చోరీకి గురైనట్లు ఓ వ్యక్తి పెనుగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులపై అనుమానం రాగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారం రికవరీ చేసినట్టు తెలపారు. ఈ దొంగతనానికి పాల్పడింది మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు కాగా ఇక్కడ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రాజారామ్ డీకోలే, ఆనంద్ లక్ష్మణ్ దండే, లక్ష్మణ్ రాజారామ్ పిటేకర్ మిగతా అయిదుగురిని మహారాష్ట్ర వెళ్లి అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ ముగ్గురిని తణుకు కోర్టుకు తరలించామన్నారు. ఈ కేసులో ప్యూహాత్మకంగా వ్యవహరించిన సీఐ జీవీఎం.నాగేశ్వరరావు, ఎస్‌ఐ వీవీ రమేష్ సిబ్బందిని అభినందించారు.
