సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రోజును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో నేడు, శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యుల కుల దేవత శ్రీనగరేశ్వర స్వామి మహిషాసుర మర్దని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొని శ్రీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు పాల్గొన్నారు. అనంతరం నిత్యాన్నదాన సత్రం ప్రాంగణంలో హోమం లో పాల్గొన్నారు. అక్కడే ఉన్న వాసవి ధామ్‌ను సందర్శించి 90 అడుగులు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు , ఆర్‌అండ్‌బీ అధికారులు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
