సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం ఉదయం పెనుమంట్ర మండలం, సోమరాజు ఇల్లిందలపర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ రంగనాథ రాజు తనయుడు నరేష్ రాజుతో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ వాసు రెడ్డి సతీమణి కర్రి రాధా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఘన స్వాగతం పలికారు. జగనన్న ను సీఎం చేయడానికి మరోసారి మేమంతా సిద్ధం అంటూ నినాదాలు చేసారు. వందలాది మంది మహిళలు గ్రామస్తులు ఆమె వెంట ఇంటింటికి తిరిగి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రీ వెంకటనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ వనుము సూర్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు మరియు గ్రామ సొసైటీ అధ్యక్షుడు కొవ్వూరి సూర్య భాస్కర్ రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు కర్రీ శంకర్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ గొలుగూరి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *