సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు, మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన “మేకపాటి గౌతమ్‌రెడ్డి” సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. . ఐదు లక్షలు ఎకరాలకు.. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజక వర్గాలకు మేలు చేకూరే విధంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడున్నర ఏళ్లుగా ఒక మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లను రూ.320 కోట్లతో పూర్తి చేసినట్లు వివరించారు. ‘సంగం ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా వేగం పెంచాం, పూర్తి చేశాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినందుకు గర్వ పడుతున్నా. నాన్నగారి హయాంలో ప్రాజెక్టు ప్రారంభిస్తే, ఆయన మరణం తర్వాత నిర్లక్ష్యం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం సంగం బ్యారేజి కోసం రూ.30 కోట్ల 5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. సంగం ప్రాజెక్టుకు మన ప్రభుత్వంలో రూ.200 కోట్లు ఖర్చు చేసి పూర్తీ చేసాం. కోవిడ్ సమస్య, వరద సమస్య ఉన్న మూడేళ్లలో పూర్తి చేశాం. నా స్నేహితుడు మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. 3లక్షల 85 వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోంది. నా తండ్రి. వై యస్ జలయజ్ఞంలో పెట్టిన 26 ప్రాజెక్ట్‌లు ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం” అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *