సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ముందు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం తగ్గించిన విషయం తెలిసినదే. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్ తర్వాత సామాన్య ప్రజలు షాక్ ఇచ్చాయి గ్యాస్ సిలిండర్ కంపెనీలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.8.50 పెంచాయి. కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను పెంచాయి. IOCL వెబ్‌సైట్ ప్రకారం.. ఈ మారిన రేట్లు నేటి గురువారం నుండి ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఈ సిలిండర్ ముంబైలో రూ.1605, చెన్నైలో సిలిండర్ ధర రూ.1817కి చేరింది. హైదరాబాద్‌లో రూ.1872 ధరలకు లభిస్తుంది.
