సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది పండుగ వేళలు నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గని బంగారం ధరకు నేడు గురువారం కాస్త విశ్రమించింది. నిన్నటి నుంచి బంగారం ధరకు బ్రేక్ పడింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్ తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ. 200 తగ్గడం విశేషం. అయితే ఈ తగ్గడమనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి బంగారం కొనాలనుకున్నవారు ఈ రోజు కొనడం మంచిది. . రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730 గా కొనసాగుతోంది. ఇక వెండి కూడా చాలా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 300 మేర తగ్గి రూ. 74800కు చేరుకుంది. తాజగా హైదరాబాద్, విజయవాడ లలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,730 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో. విజయవాదాలలలో కిలో వెండి ధర రూ. 74,800 కి అందుబాటులో ఉండగా న్యూఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ. 72,200 వద్ద స్థిరంగా ఉంది.
