సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా పెంచేస్తున్న సుంకాల దెబ్బకు తరుచు భారత్ ఫై భారీ ప్రభావము పడుతుంది. బంగారం వెండి ధరలు (Gold, Silver ). రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం భారీగా పెరిగిన ధరలు నేడు మంగళవారం కూడా ర్యాలీని కొనసాగించాయి. నేడు మంగళవారం మధ్యాహ్నం సమయంలో విజయవాడ, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1040 మేర పెరిగి రూ.1,47,280ల రికార్డు స్థాయికి చేరింది. 22 క్యారెట్‌ల బంగారం ధర కూడా రూ.1,35,000కు ఎగబాకింది. ఇక తెలుగు రాష్ట్రాలలో వెండి ధర కూడా చుక్కలనంటింది. ఒక్కరోజులో ఏకంగా రూ. 12 వేల మేర పెరిగి రూ.3,30,000కు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *