సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని పేటీఎం (Paytm) వినియోగదారులకు తాజగా శుభవార్త.. . ఇకపై ఏ ఇతర యూపీఐ పేమెంట్ యాప్‌కు చెందిన మొబైల్ నంబర్‌కైనా పేటీఎం యాప్ నుంచి యూపీఐ పేమెంట్లు అవలీలగా పంపవచ్చు.అవతల వ్యక్తి పేటీఎం యాప్‌పై రిజిస్టర్ కాకపోయినా పేమెంట్లకు ఇక ఎలాంటి అవరోధం ఉండదు. ఈ మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటన చేసింది. ఏ పేమెంట్ యాప్ అయినా సరే రిజిష్టర్డ్ యూపీఐ ఐడీ కలిగివున్న అన్ని మొబైల్ నంబర్లకు డబ్బు పంపించొచ్చు, స్వీకరించవచ్చునని పీపీబీఎల్ తెలిపింది. కాగా ఎన్‌పీసీఐఅన్నీ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్లకు డేటా బేస్ యాక్సెస్‌ను ఇచ్చింది. ఎలా అంటే.. ముందుగా .. పేటీఎం యాప్‌పై ‘యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్’ సెక్షన్‌లో ‘ టు యూపీఐ యాప్స్’పై ట్యాప్ చేయాలి.తరువాత… ‘ఎంటర్ మొబైల్ నంబర్’పై ట్యాప్ చేయాలి. అక్కడ గ్రహిత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. పంపించాల్సిన మనీ ఎంతో ఎంటర్ చేశాక.. క్విక్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ‘పే నౌ’పై ట్యాప్ చేయాలి. అంతే సొమ్ము బదిలీ అవుతుంది. నిరంతరాయ, భద్రమైన పేమెంట్ల కోసం దృఢమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని పేటీఎం ప్రతినిధులు ప్రకటించారు.
