సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం విజయవాడ శివారు నుండి గన్నవరం మీదుగా బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ( కంటి ఫై గాయానికి పట్టి వేసుకొన్నారు ) చూడటానికిఆయన అభిమానులు, స్థానికులు విశేషంగా రోడ్లపైకి రావడంతో ఎక్కడ చుసిన వేలాది మంది జనంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వారందరికీ నిప్పులు కక్కుతున్న ఎండలో బస్సు ఫై నిలబడి సీఎం జగన్ నవ్వుతూ అభివాదం చేసుకొంటూ యాత్ర నేటి సాయంత్రానికి గుడివాడ వరకు కొనసాగించారు. మధ్యలో కేసరపల్లి లో మరియు గుడివాడ సమీపం లో నాగవరప్పా డు వద్ద ఏర్పా టు చేసిన బహిరం గ సభల లో సీఎం జగన్ మాట్లాడుతూ.. గుడివాడలో మహా సముద్రం కనిపిస్తుందన్నారు. మే 13న జరగబోతున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇదని అన్నారు,. . పేదల భవిష్యతు కోసం , పథకాల కొనసాగింపు కోసం పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్దమా? అని ప్రశ్నించారు. ఒక్క జగన్ ఫై ఎంత మంది దాడి చేస్తున్నారో మీరు చూస్తున్నారని, నా నుదుటి మీద వారు చేసిన గాయం నా సంకల్పాన్ని మరింత పెంచింది. ఆ దేవుడు నాస్క్రిప్ట్ పెద్దగా రాశారు. పేదలకు ఏ మంచీ చేయొద్దన్నది కూటమి నాయకుడు చంద్రబాబు ఫిలాసఫీ ,, అందుకే కిలో బియ్యం 2 రూ ఇవ్వొద్దని ఎన్టీఆర్ను గద్దె దింపింది చంద్రబాబే. స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం వద్దంటూ ప్రభుత్వ బడులను పాడుబెట్టింది చంద్రబాబే.. ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది చంద్రబాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని కేంద్రానికి చెప్పింది చంద్రబాబే, చంద్రబాబు జన్మ భూమి కమిటీల పేరుతో గ్రామాలనుదోచుకున్నారు. చంద్రబాబు మార్కు పాలన అంటే పచ్చ పాముల కాటు కు ప్రజలు బలి కావడమే.. అన్నారు సీఎం జగన్ ( ఫై ఫోటో విజయవాడ గన్నవరం రోడ్లపై )
