సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో నేడు, మంగళవారం స్థానిక 24వ వార్డు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి, ఇళ్ల స్థలాలకు ఆర్జీలు సమర్పించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరు పేదలకు గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశనా స్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా అదనపు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని, వచ్చే నెలలో కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాక పోతే ఇళ్ల స్థలాల సాధన సమితి ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాం ప్రసాద్,సికిలే పుష్పకుమారి, అధిక సంఖ్యలో ఇళ్ళ స్థలాలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
