సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అందరికి ఇళ్ళు అంటూ ‘హౌస్ ఫర్ ఆల్’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబరు 23 ను తక్షణమే అమలు చేయాలని భీమవరంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నేడు, సోమవారం సిపిఐ అధ్వర్యంలో ఇళ్ల స్థలాల సాధన కమిటీ తహశీల్ధార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని, ఇళ్ళ స్థలాల వ్యక్తిగత అర్జీలను తహసీల్దార్ ఆర్.రాంబాబుకు అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలిచ్చి పేదల స్వంత ఇంటి కల నెరవేరుస్తాం అన్నహామీలు నెరవేరుస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
