సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురంలో నేటి,బుధవారం స్థానిక పురపాలక సంఘం సమావేశ మందిరంలో జిల్లా హౌసింగ్ పి.డి. టి.వేణుగోపాల్ అధ్యక్షతన నరసాపురం డివిజన్ కు సంబంధించి గృహా నిర్మాణ , తది తర అధికారులతో పేదలందరికీ ఇల్లు పై సమీక్ష సమావేశం శ్రీ యం. కమాలకర బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాకర బాబు మాట్లాడుతూ హౌసింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జూన్ 22 కి పూర్తిస్థాయిలో అందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ చారిత్రాత్మకంగా ఇండ్ల నిర్మాణం నిరుపేదలకు ఒక వరం అని , నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం ఒక బృహత్తర కార్యక్రమంలో మన మంతా భాగస్వాములు అవ్వటం ఒక గొప్ప అదృష్టంగా భావించాలి అని, తక్కువ ఖర్చుతో లబ్ధి దారులకు తను అనుకున్న రీతిలో అంద మైన గృహ నిర్మించే లా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా మ్యాపింగ్, జియో రిజిస్ట్రేషన్, జాబ్ కార్డు, పేమెంట్, గ్రౌండ్ లివింగ్, బిల్లింగ్ మెటీరియల్ సప్లై, తదితర తొమ్మిది అంశాల ప్రగతిపై సమీక్ష చేశారు. ఇల్లు నిర్మాణం లో అధికారులు వెనుకబడిన కారణాలపై నిలదీశారు. ఇసుక మెటీరియల్, పేమెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని, కోర్టు కేసులు కూడా లేవనిపేర్కొన్నారు టార్గెట్ ప్రకారం పనులు మొదలు పెట్టి తదుపరి సమావేశంలో ప్రగతి కనబరచాలని, లోటు కనబడితే చర్యలు తప్పవని కమలాకర బాబు హెచ్చరించారు. టి. వేణు గోపాల్ గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్కూడా మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇ ఇ జి. పిచ్చయ్య,డి. , ఏ ఈ లు , వర్క్ ఇన్స్పెక్టర్ లు, ఇంజనీరింగు అధికారులు ,తది తర టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
