సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం కింద 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం ప్రభుత్వ కోటా సీట్ల ప్రవేశాలకు ఆర్టీఈ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటన తాజగా విడుదల చేసారు. . ఈ నోటిఫికేషన్ కింద సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ పాఠశాలల్లో.. AP RTE 2026 Admissions: నిరుపేదలకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచితంగా కార్పొరేట్ చదువులు అందించడం .కోసం ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. పూర్తీ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ నుంచి లేదా గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రం, లేదా సంబంధిత పాఠశాల నుంచి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సందేహాలకు టోల్‌ఫ్రీ నంబరు 18004258599కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థుల అర్హత నిర్ధారిస్తారు.
