సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎందరో యువకులను, ముఖ్యంగా ఎందరో విద్యార్థులను తనలో కలిపేసుకొనిపోయిన సముద్ర తీరా ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రమాదకర పేరుపాలెం బీచ్‌లో మరో యువకుడు మృతి చెందాడు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి యడ్ల చిట్టిబాబుకుమారుడు యడ్ల మధుబాబు (23) డిగ్రీ పూర్తిచేసి మంచి భవిషత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాస్తున్నాడు .గత సోమవారం తన స్నేహితులతో కలిసి పేరుపాలెం సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత ప్రయతించిన కాపాడలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత మృతుడుగా ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. నరసాపురం ఏరియా ఆసుపత్రిలో మధుబాబు మృతదేహన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, సీపీఎం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం, నాయకులు సందర్శించి నివాళులర్పించారు.
