సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పేరుపాలెం బీచ్ లో నేటి ఆదివారం సాయంత్రం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు లోహిత్, నిఖిల్ లు గల్లంతు కావడం తీవ్ర విషాదం నింపింది. ప్రాధమిక సమాచారం ప్రకారం భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న 12 మంది హాస్టల్ విద్యార్థులు ఆదివారం కావడంతో సరదాగా గడపడానికి పేరుపాలెం బీచ్ కి వెళ్లారు. అయితే వీరిలో లోహిత్, నిఖిల్ లు సముద్ర అలల తాకిడికి గల్లంతు కావడం జరిగింది..వీరిరువురు రాజమండ్రి , విజయనగరం కు చెందినవారుగా? భావిస్తున్నారు. అని, వారిలో తాజా సమాచారం ప్రకారం లోహిత్ మృతదేహం స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.. నిఖిల్ కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *