సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో ఎందరో యువత జీవితాలను సముద్రంలో కలిపేసిన ప్రమాదకరమైన పేరుపాలెం బీచ్లో గత ఆదివారం సాయంత్రం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రామన్న పాలెం పంచాయతీ ఆకనవారితోటకు చెందిన 10 మంది యువకులు మధ్యాహ్నం సమయంలో పేరుపాలెం బీచ్ కు ఆహ్లదంగా గడపడానికి వెళ్ళారు. వారిలో సముద్ర స్నానానికి దిగిన ఆకన సత్య ప్రసాద్, కొమ్ము ల శ్రీరామచంద్ర మూర్తి గల్లంతు కాగా, మద్దుల సాయి అనే యువకుని మాత్రం స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతున్నాడు. గల్లం తైన ఇద్దరిలో సత్య ప్రసాద్(18) మృతదేహం తీరానికి కొట్టుకు రాగా, శ్రీరామచంద్రమూర్తి కోసం గాలిస్తున్నారు. సత్య్ర ప్రసాద్ 10వ తరగతి పాసై తండ్రి వ్య వసాయ పనుల్లో సహకరిస్తుండగా, శ్రీరామచంద్రమూర్తి నరసాపురం లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నిండుకొంది .
