సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రమాదకర బీచ్ గా పేరొంది ఎందరో యువతను తనలో కలిపేసుకొన్న పేరుపాలెం సముద్ర తీరం మరోసారి నేడు, ఆదివారం మరో ముగ్గురు యువకుల ఉసురు తీసింది?అని భావిస్తున్నారు,. తణుకు పట్టణానికి చెందిన నలుగురు యువకులు నిన్న సాయంత్రం గోదావరి నదిలో గల్లంతయి మరణించిన విషాదం ఇంకా మీడియాలలో ఇంకా పూర్తిగా ప్రచారం కాకుండానే .. తణుకు పట్టణం బొమ్మల వీధికి చెందిన సుమారు పది మంది నేడు, ఆదివారం పేరుపాలెం బీచ్ కు వెళ్లారు. వీరిలో ఐదుగురు సముద్ర స్నానానికి దిగి గల్లంతు కాగా.. వారిలో ఇద్దరిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గొరస సావిత్రి (35), అనుపోజు వసంత కుమార్ (18), అనుపోజు రఘువర్మ (26) గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ వరుస 2 గల్లంతు విషాదాలలో మరణించిన యువకులు తణుకు పట్టణానికి చెందిన వారు ఉండటం యాదృచ్చికం..
