సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం రాత్రి మొగల్తూరు మం డలం కేపీపాలెం దక్షిణ వైపు బీచ్లో సముద్ర స్నానం చేస్తూ గల్లంతైన ఇద్దరు ఇం జినీరింగ్ విద్యార్థుల విషాదం మన సిగ్మా న్యూస్ వీక్షకులకు తెలిసిందే. అయితే వారి ఇద్దరి మృతదేహాలు గత రాత్రికి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.ఏఎస్సై రాజేంద్ర ఆధ్వర్యంలో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు . మొగల్తూరు పోలీసులు అధికారికంగా తెలిపిన సమాచారం ప్రకారం,. పెన్నాడలోని భీమవరం ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఇం జినీరింగ్ టెక్నాలజీ (బైట్) కళాశాలకు చెందిన 11 మంది ఈసీఈ విద్యార్థులు భీమవరం వెళ్లి సినిమా చూశారు. అనంతరం సరదాగా రైలులో నరసాపురం చేరుకుని అక్కడి నుండి ఆటోలో పేరుపాలెం సముద్ర తీరానికి వచ్చారు. పాండురంగస్వామి ఆలయ సమీపంలో సముద్ర స్నానాలు చేస్తుండగా అలల ఉద్ధృతికి విజయనగరానికి చెందిన 19 ఏళ్ళ కందుకూరి లోహిత్ మణికంఠ, రాజమండ్రి ,ధవళేశ్వరానికి చెందిన కొమ్మినేని లిఖిత్ కుమార్ (18) మరణించారు. పేరుపాలెం బీచ్ ఎంతటి ప్రమాదకరమో భీమవరం అటు నరసాపురం వాసులకు దశాబ్దాలుగా తెలుసు! జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు ఉన్నపటికీ ఇప్పటికే ఎందరో యువకులు అత్యుత్సహంతో ఈ బీచ్ లో అర్ధాంతరంగా తనువులు చాలిస్తూ తమ కుటుంబాలలో పుత్ర శోకాలతో తీవ్ర విషాదం నింపుతున్నారు. ప్రభుత్వ అధికారులు బీచ్ కార్తీక మాసం తో పాటు ప్రతి ఆదివారం ఇక్కడ గజఈతగాళ్లను అందుబాటులో పెడితే కొంత ప్రయోజనం ఉంటుంది..
