సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మచిలీపట్నం కొబ్బరితోటలో అక్రమ నిర్మాణాలు అంటూ వాటిని కూల్చివేత ఘటనలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అక్కడ కు వచ్చి పోలీసులను హెచ్చరించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. అయితే.. దీనిపై పేర్ని నాని నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత గురువారం జరిగిన ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికార సంఘం అధినేత జయపాల్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడారని ఆరోపించారు. గత మా వైసీపీ ప్రభుత్వంలో ఏ పేదవాని ఇంటినీ మేం కూల్చలేదు. కానీ ఇప్పటి ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఇప్పుడు కొబ్బరితోటలను కూల్చడం ప్రారంభించారు.పోలీసులు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని తెలిపారు.. అసలు ఆ సీఐని మేమెక్కడా ఉదహరించలేదు. ఆయన పేరుతో ఏమీ తిట్టలేదు. . అయినా నన్ను ఏకవచనంతో మీ పోలీసులు మాట్లాడవచ్చా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు.’నా మీద, నా కొడుకు మీద అక్రమ కేసులు కట్టారు. మంత్రి కొల్లు రవీంద్ర ఎన్నోసార్లు పోలీస్ అధికారులను తిట్టారుగా.? అప్పుడీ పోలీస్ జిల్లాధ్యక్షుడికి(జయపాల్‌ను ఉద్దేశించి) తప్పు కనపించలేదా.? మరప్పుడెందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
