సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీ నుండి నేడు, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఫై జగన్ సర్కర్ కక్ష పూరితంగా పెడుతున్న కేసులు నిలబడవనీ టీడీపీ శ్రేణులు ఆందోళన పడవద్దని, ఇటీవల సుప్రీం లో ఫైబర్ నెట్ కేసు లో చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చిందని, అయితే కేసు విచారణ వాయిదా పడిందని.. కేసులో ఏమి లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు జోస్యం చెప్పారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ అయినా స్కిల్ డెవలప్మెంట్ కేసు లో 7 రోజుల్లో తీర్పు ఇస్తామని అన్నారని.. ఈనెల 31లోగా వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏపీలో విద్య వ్యవస్థలో సీఎం, ప్రభుత్వం తన తెలివితో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం అందరూ చదువుకోవాలని జగన్ అంటున్నారని, కానీ ప్రభుత్వ స్కూల్స్ లో గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉందని అన్నారు. 43 వేల స్కూల్స్‌లో సీబీఎస్ సిలబస్ తీసుకువస్తామని సీఎం జగన్ అంటున్నారని, ప్రస్తుతం అసలు వెయ్యి స్కూల్స్‌కే దిక్కులేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు న్యాయవాదులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని లక్ష్మీపార్వతి అంటున్నారని, సీఎం జగన్ ముకుల్ రోహత్గికి ఇతర న్యాయవాదులకు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్ని కోట్లు పీజు చెల్లించి ఉంటాడో? జగన్మోహన్ రెడ్డిని లక్ష్మీపార్వతి అడగాలని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *