సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, నవంబర్ 1 ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు స్వర్గీయ పొట్టి శ్రీరాములుకు ఘన నివాళ్లు తెలియజేస్తున్నారు. నిజానికి మద్రాస్ లో నిరాహారదీక్ష చేయడానికి ముందే తెలుగు వారికీ ప్రత్యేక బాషా ప్రయుక్త రాష్ట్రము కావాలని పొట్టి శ్రీరాములు మొదటగా భీమవరం త్యాగరాజ భవనంలో ( ప్రస్తుత ఆర్యవైశ్య భవనం ) 14 రోజుల పాటు నిరాహార దీక్ష చేసారు. తదుపరి కొందరి పెద్దల సూచనతో ఢిల్లీ పెద్దలకు ఉద్యమం ఫోకస్ కావాలని.. కొంత విరామం తరువాత మద్రాస్ లో నిరాహార దీక్ష ప్రారంభించి 50 రోజులు పైగాచేసి అమరులయ్యారు. దానితో ఆంధ్ర రాష్ట్రము అవతరణ జరిగింది. భీమవరం ఆదివారం బజారులో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి నేడు, మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మానేపల్లి నాగేశ్వర రావు, వైసీపీ నేతలు ఇతర ఆర్యవైశ్య ప్రముఖులు పుష్పమాలలు వేసి ఘననివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి తెలుగువారికి అమరజీవిగా చిరపరిచితులు పొట్టి శ్రీరాములు.. తెలుగువారికీ అంధ్రరాష్ట్రము వచ్చిందంటే పట్టుదలతో ఆయన చేసిన త్యాగమే.. అటువంటి వ్యక్తి కి భీమవరం జిల్లా కేంద్ర అయిన తరువాత ఆయన విగ్రహం వద్ద నివాళ్లు అర్పించడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కార్యసాధనకు పొట్టి శ్రీరాములు పట్టుదలను,త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకోవాలి అని పిలుపునిచ్చారు.
