సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం సాయంత్రం రాజమండ్రి లోని హోటల్ మంజీరాలో టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, వచ్చే ఎన్నికలలో పొత్తులో భాగంగా సీట్ల పంపిణి , ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చిస్తున్నారు. లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్‌తో పాటు సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, భీమవరం కు చెందిన కొటికలపూడి గోవిందరావు, నరసాపురం కు చెందిన బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని, మహేంద్ర రెడ్డిలు పాల్గొన్నారు.
