సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో 2024 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ జనసేనకు 30 నియోజకవర్గాలు కేటాయిస్తూ పొత్తు కుదిరిందని, ఇప్పటికే జనసేన కు కేటయించిన 24 నియోజకవర్గాల పేర్లు కూడా మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలపై .. పవన్ సోదరుడు నాగబాబు నేడు, శనివారం కర్నూల్ లో స్వాందించారు.. మౌర్య హోటల్లో జనసేన వీర మహిళల సమావేశంలో నాగబాబు పాల్గొని ప్రసంగించారు. పొత్తులపై, సీట్ల కేటాయింపు విషయాలు పవన్ కళ్యాణ్ చూసుకొంటారని ఏదిఏమైనా పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దే తుది నిర్ణయమని ఒక వేళ పొత్తు లేకుండా ఉంటే జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తులు ఉంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముందుకు వెళతామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు పాటించవలసి ఉందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు హోదాలో నాగబాబు స్పష్టం చేశారు. అయితే నాగబాబు ఎక్కడ టీడీపీ పొత్తు.. సీట్ల కేటాయింపు వార్తలను ఖండించలేదు..
