సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు, బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. హెలికాఫ్టర్ లో చేరుకొన్న జగన్ కు దారి పొడవునా వేలాదిగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు ఘన స్వగతం పలికాయి. పోలీసులకు వారిని అదుపు చెయ్యడం కష్టంగా మారింది. అయినప్పటికీ జగన్ వారికీ అభివాదాలు చేసుకొంటూ పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా జగన్‌కు నిరసనగా సాక్షి టీవీలో అమరావతి మహిళలను వేశ్యలు అంటూ కించపరుస్తూ డిబేట్ లో వ్యాఖ్యలు చేసారని కొందరు టీడీపీ మహిళలు నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఊహించని విధంగా కొన్ని రాళ్ళూ చెప్పులు జగన్ కాన్వాయి మీదకు గాలిలోకి లేచాయి.ఇక ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకొని ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. తమ పార్టీ అధినేత పర్యటనను ఓర్వలేకే టీడీపీ శ్రేణులు ఈ విధంగా దాడులకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు తలకు గాయం అయ్యింది. మరోపక్క పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేష్ ప్రకటన విడుదల చేశారు. మహిళలు, పోలీసుల పై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
