సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అపూర్వ చిత్రాల సృష్టికర్త మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1తాజాగా ఈ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. చోళుల, పాండ్యుల స్వర్ణయుగాన్ని, వారి పోరాటాలను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి సిద్ధమవుతున్నారు మణిరత్నం. ఇందులో మొదటి భాగం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. చియాన్ విక్రమ్ , కార్తి , జయం రవి హీరోలుగా ఐశ్వర్య రాయ్ , త్రిష , ఐశ్వర్య లక్ష్మీ, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ విడుదల చేశారు.రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్…‘వెయ్యి సంవత్సరాల క్రితం చోళనాట స్వర్ణశకం ఉదయించక మునుపు ఒక తోకచుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళరాజ కులంలో ఒకరిని ఆ తోకచుక్క బలిగోరుతుందంటున్నారు జ్యోతిష్యులు. దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. వంచన.. ద్రోహం రాజమందిరంలోకి చొచ్చుకుపోతున్నాయి’.. అంటూ ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది.
