సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ భారతంతో పాటు శ్రీలంక, చైనా,ఇండోనేసియా మలేసియా వరకు ఏలిన చోళ తమిళ రాజుల చారిత్రక నేపథ్యంలో .. కల్కి కృ ష్ణ మూర్తి రాసిన‘పొన్ని యన్ సెల్వ న్’ నవల ఆధారంగా.. ‘బాహుబలి’ స్ఫూర్తి తో ‘లెజెం డరీ ఫిల్మ్ మేకర్’ మణిరత్నం 3 ఏళ్ళు పైగా కస్టపడి నిర్మించిన పాన్ ఇండియా సినిమా పొన్ని యన్ సెల్వ న్-1( మొదటి భాగం) నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో, చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వ ర్య రాయ్, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, వంటి భారీ తారాంగణం ఉండటం వందల కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించిన సైనిమా పైగా ఏఆర్ రెహమాన్ సంగీతం దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే సినిమా రివ్యూ విషయానికి వస్తే.. కథంతా పదో శతాబ్దంలో జరుగుతుంది. వేయి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్)కి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్) తం జావూరుకు దూరంగా ఉంటూ.. కనిపించిన రాజ్యా నల్లా ఆక్రమిస్తూ వెళ్తుంటాడు. చిన్న కుమారుడు అరుళ్మోళి అలియాస్ పొన్నియన్ సెల్వ న్(జయం రవి) చోళ రాజ్యనికి రక్షకుడిగా ఉంటాడు. తండ్రి ఆజ్ఞతో శ్రీలంకలో ఉంటాడు. తన వారసుడిగా పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను ఏకం చేస్తాడు కోశాధికారి పళవేట్టురాయర్(శరత్ కుమార్). సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు(రహమాన్) ను రాజును చేయాలనేది అతని కోరిక. ఆ కుట్రను చేధించడానికి తనమిత్రుడు వల్లవరాయన్(కార్తి)ని తంజావురుకు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. కుట్ర విషయాన్ని వల్లవరాయన్ ఎలా కనిపెట్టాడు? పళవేట్టురాయల్ భార్య నందిని(ఐశ్యర్య రాయ్) ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? అసలు నందిని, ఆదిత్యకు మధ్య ఏం జరిగింది? అనేదే మిగతా కథ.. మణిరత్నం ఎంత కస్టపడి సినిమా తీసిన చారిత్రాత్మక నేపథ్యంలో కథ తమిళులకు తెలిసినంతగా తెలుగు వారికీ తెలియదు. కాబ్బటి ఇక్కడి ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో వేచి చూడాలి. మరో మైనస్ ఏమిటంటే తెలుగులో స్వంత డబ్బింగ్ చెప్పుకొనే చియాన్ విక్రమ్ క్రేజ్ అంత ఇంతా కాదు. మరి అతని క్యారెక్టర్ కొన్ని సన్నివేశాలకు పరిమితం కావడం మనవాళ్ళుకు రుచించదు. అసలు ఐశ్వర్య రాయ్ , విక్రమ్ ల ప్రేమ కధ 2వ భాగానికి వాయిదా వెయ్యడంతో ఆ పార్ట్ 2 ఫై ఆసక్తి కలుగుతుంది. యాక్షన్ సీన్స్ కూడా బాహుబలి స్థాయి లో లేవనే చెప్పాలి. క్లైమాక్స్ బాగుంది. చివరలో ఓ చిన్న ట్వి స్ట్ ఇచ్చి పార్ట్-2పై ఆసక్తి పెంచారు. మొత్తం గా ఈ చిత్రం సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర వల్లవరాయన్. ఈ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. ఆదిత్య కరికాలుడు పాత్రలో చియాన్ విక్రమ్ గెటప్ , నటన అదిరిపోయింది. అయితే నట విశ్వరూపం పార్ట్ 2 వరకు వేచి చూడాలి. నందిని పాత్ర లో ఐశ్యర్యరాయ్. ఎలాంటి మగవాడినైనా తనవశం చేసుకోగల పాత్ర తనది. తెరపై చాలా అందంగాకనిపించింది. రాజకుమారి కుందవైగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫోటోగ్రఫి సూపర్..రెహమాన్ సంగీతం పర్వాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *