సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విశాఖపట్నం లో నేడు, శనివారం ఏయూగ్రౌం డ్స్ లో ప్రధాని మోడీ సమక్షంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖలో జనసముద్రం కనిపిస్తోం ది. దేశ ప్రగతి సారథి ప్రధాని నరేంద్ర మోదీగారికి స్వాగతం .ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా , జగన్నాథ రథచక్రాలు గా జనం ఇక్కడికి తరలి వచ్చా రు. వం గపాడు పాట ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా..’ అనే పాటలా జనం తరలివచ్చా రు. ఈ రోజు దాదాపు పది వేల కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి.. రాష్ట్ర ప్రభుత్వం , అశేష జనం తరపున ధన్య వాదాలు.ఈ మూడున్న రేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృ ద్ది దిశగా దూసుకెళ్లిం ది. విద్య , వైద్యం , సాగు, సామాజిక న్యాయం , మహిళాసం క్షేమం , అభివృద్ధి, సం క్షేమం మా ప్రాధాన్యతలు అయ్యాయి. అభివృద్ధి . వీకేంద్రీకరణ, పాదర్శకతతో పాలన కొనసాగిస్తున్నాం ..కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహకారాలు మరింత కావాలి. ఎనిమిదేళ్ల కిందటినాటి విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. విభజన హామీలైన పోలవం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.. ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం . పెద్దలు సహృదయులైన మీరు(ప్రధానిని ఉద్దేశిస్తూ..)మమ్మల్ని ఆశీర్వదించాలి. మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరిం చాలని మరోసారి కోరుతున్నాం అని సీఎం జగన్.. ప్రధాని సమక్షం లోనే బహిరంగ విజ్ఞప్తి చేశారు.అయితే సీఎం జగన్ చేసిన డిమాండ్స్ ఫై ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం గమనార్హం..
