సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏపీ పోలవరం కు చెందిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా తో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేసేందుకు కేం ద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్గ్ అంగీకరించింది. పోలవరం మొదటి దశ నిర్మా ణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ఆమోదం తెలిపిం ది. అంతేకాకుండా.. కొత్త డయాఫ్రం వాల్ పునః నిర్మాణం సహా పనుల వేగం పెంచేందుకు తొలిదశ ప్యాకేజీ నిధులు ప్రకటించింది. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది.
