సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు, గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. కూటమి ద్వారా తన గెలుపునకు సహకరించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సీజన్‌కు పంటలను కాపాడేందుకు కాలువలో డిసిల్టింగ్‌కు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫ్లడ్ వచ్చినప్పుడు మెటీరియల్ ముందుగానే రిజర్వ్ చేసుకుంటామన్నారు. గతంలో వరదలు వస్తే పాలకొల్లులో రైతులతో పాటు తామే సంచులు తెచ్చుకొని గట్లను కపాడుకున్నామని నిమ్మల రామానాయుడు అన్నారు. అక్కడ గత ప్రభుత్వ హయాంలో పంటకాలువల లో తట్ట మట్టి తియ్యలేదని ఇకపై తన హయాంలో ఆలా జరగనీయానని రానున్న ఫ్లడ్ విషయంలో ముందు నుంచి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ కు కేటాయించింది 30 వేలు కోట్లు మాత్రమేనని నిమ్మల తెలిపారు. పోలవరం ఏపీకి వరమని, జీవనాడి అని పోలవరంలో ఎంత డబ్బు.. ఎవరెలా దోచేశారో విచారిస్తాం.. తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టం. వెంటనే జలవనరుల శాఖ పరిస్థితిపై గత ప్రభుత్వ విధ్వంసంపై శ్వేత పత్రం విడుదల చేస్తాం’’ అని నిమ్మల రామానాయుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *