సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, సోమవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరంలో పర్యటించారు. ముందుగా ఆయన పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ హెలిపాడ్‌కు చేరుకున్నారు. ప్రాజెక్టు పనుల గురించి సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. పోలవరం పనులపై అధికారులు, ఇంజినీర్లతో మంత్రి నిమ్మల రామానాయుడు తో కలసి చంద్రబాబు సమీక్ష చేసారు. ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై చర్చించారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం వల్ల 7 లక్షల 20 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఉందని తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉందని తెలిపారు. పోలవరం, అమరావతి రెండు కళ్లు అని అన్నారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఏపీకి గేమ్ ఛేంజర్‌గా తయారువుతుందని చెప్పారు.
