సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టాకరంగా పోలవరం ప్రాజెక్టు ను అమెరికా, కెనడాలకు చెందిన విదేశీ నిపుణుల బృందం నేడు,ఆదివారం పరిశీలన ప్రారంభించింది. వరుసగా నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రంవాల్ ప్రాంతాలను విదేశీ నిపుణులు పరిశీలించి వాటి సమర్ధత ను నిర్ధారిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న స్థానిక ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై అంతర్జాతీయ నిపుణులు నివేదిక ఇస్తారు.రేపు సోమవారం చంద్రబాబు నిపుణులతో పోలవరం సమీక్షా నిర్వహించనున్నారు.
