సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు సమయంలో పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వేసిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. . ఉత్తర ఆంధ్రాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు సరఫరా చేయడమే తమ లక్ష్యమని దీనికోసం . పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని మంత్రి చెప్పారు. ప్రస్తుత బడ్జెట్‌లో పేజ్-1, పేజ్-2 పనుల కోసం రూ.600 కోట్లు కేటాయించామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,200 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఎడమ కాలువ పనులను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. .
