సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రజల భవిషత్తు ను నిర్ణయించే అత్యంత ప్రతిష్టాకర ప్రాజెక్టు పోలవరం ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొందన్న వార్తపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో జగన్ హయాంలో ఎత్తు తగ్గించకపోయిన తగ్గించేస్తున్నారని చంద్రబాబు పవన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారని ఇప్పుడు నిజంగా ఎత్తు తగ్గిస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకొంటే ఎవరు మాట్లాడరేమిటి? అని వైసీపీ మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు . ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ తాజగా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబుగారూ… ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా?అని ప్రశ్నించారు.
