సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసియా ఖండంలోనే ప్రతిష్ఠాకర నిర్మాణంగా ఖ్యాతి గాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మ‌రో ముంద‌డుగు ప‌డింది.. దెబ్బ‌తిన్న డ్ర‌యాఫ్రం వాల్ స్థానంంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు నేటి శనివారం ఉదయం10 గంటల 19 నిమిషాలను నిర్మాణ పనులను లాంఛనంగా తిరిగి ప్రారంభించారు. సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేయ‌నున్నారు. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపైనే ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. గతంలో వరదలకు దెబ్బతిన్న పాత డయాఫ్రంవాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.396 కిలో మీట‌ర్ల పొడ‌వున‌, 1.5 మీట‌ర్ల మందంతో కొత్త డ‌యాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం ప్లాస్టిక్ కాంక్రీట్-టి5 మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కనిష్ఠంగా 20 మీట‌ర్లు, గ‌రిష్ఠంగా 94 మీట‌ర్ల లోతు నుంచి నిర్మాణం చేపట్టనున్నారు. డయాఫ్రంవాల్‌ నిర్మాణాల్లో నైపుణ్యం ఉన్న బావర్‌ కంపెనీ ఈ పనులు చేపట్టింది. కొత్త డయాఫ్రం వాల్ కోసం రూ.990 కోట్లు ప్రభుత్వం వ్యయం కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *