సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాకరముగా నిర్మాణం అవుతున్న పోలవరం ప్రాజెక్టు ను నేడు, మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు నేతలు, కలెక్టర్, అధికారులు ఆయనతో ఉన్నారు. పోలవరం ఫ్రాజెక్ట్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే, అప్పర్ కాపర్ డ్యాంలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని ఫోటో ఎగ్జిభిషన్ ద్వారా జగన్‌కు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దగ్గరకు చేరుకున్న సీఎంకు డయాఫ్రం వాల్ పరిస్థితిని అధికారులు వివరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇది పూర్తయితే మెయిన్ డాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ కల్లా డయాఫ్రం వాల్ పనుల పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాలలో నిర్వాసితులు అయిన 12, 658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పరిశీలన పూర్తి అవడంతో హిల్ వ్యూ వద్ద సమీక్ష సమావేశానికి సీఎం జగన్ బయలుదేరి వెళ్లారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *