సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు నేడు, సోమవారం మధ్యాహ్నం 11. 45 గంటలకు పోలవరం ప్రాజెక్టును చేరుకొన్నారు. నేటి ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. స్పిల్వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *