సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసియా ఖండంలోనే ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను నేడు, మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. తదుపరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram) పనులు నిలిచిపోయాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయితే పోలవరం ప్రాజెక్ట్ పనులు షెడ్యూల్ ప్రకారమే చక్కగా జరుగుతున్నాయని, అలాగే నాణ్యత విషయంలో కూడా రాజి పడటం లేదని అన్నారు. డీ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన ఆలస్యానికి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి వాళ్ళకే అర్థం కాలేదని, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని ఆనాటి వైసీపీ మంత్రులు అన్నారని.., మా కూటమి ప్రభుత్వ హయాంలో మాత్రం వర్షాకాలంలో కూడా పనులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80 శాతానికి పైగా పూర్తయ్యాయని ప్రకటించారు.
