సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్‌ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతూ ముగ్గురు మైనర్ బాలికల మిస్సింగ్ కేసు సంచలనం రేపింది. అయితే నేడు, గురువారం పోలీసులు వారిని పట్టుకొని నేటి సాయంత్రం వారి తల్లితండ్రులకు అప్పగిస్తున్నారు. వివరాలలోకి వెళ్ళితే.. గత బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో పాఠశాలలో తల్లిదండ్రులు వాకబు చేశారు. వారు అసలు పాఠశాలకు రాలేదని తెలుసుకొన్న తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థినులులో ఒకరు ఇంటి నుంచి నగదు, సెల్‌ ఫోన్‌ కూడా తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ముగ్గురిలో ఒకరి వద్ద సెల్‌ఫోన్ ఉండడంతో సిగ్నల్స్‌ ద్వారా నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకాశం జిల్లాలో విద్యార్థినులను గుర్తించిన పోలీసు అధికారులు వారిని ప్యూహాత్మకంగా పట్టుకొని మరికాసేపట్లో బాలికలను తల్లిదండ్రులకు అప్పగించడం తో కధ సుఖంతం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *