సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేతల అరెస్ట్ ల పర్వము కొనసాగుతుంది. కొద్దీ రోజుల ముందు వల్లభనేని వంశీ ని హైదెరాబాద్ లో ఏపీ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసిన తీరులోనే ప్రముఖ సినీ రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna )ని గత అర్ధరాత్రి ఏపీ పోలీసులు చేసి నేటి మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్ కు తీసుకొనివెళ్ళారు. గత బుధవారం రాత్రి హైదరాబాద్ లో మైహోం భూజా అపార్టుమెంట్లో ఉన్న పోసానిని పోలీసులు అరెస్ట్ చెయ్యడానికి వెళ్ళితే నోటీసులు లేకుండా రాత్రి పూట అరెస్ట్ చెయ్యడం ఏమిటని తాను హాస్పటల్ కు వెళ్లి రేపు ఉదయం సరెండ్ అవుతానని పోసాని పోలీసులతో వాదించారు. పోలీసులు ఆయన భార్య కు నోటీసు ఇచ్చినట్లు తెలిపి ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర దుర్భాషలాడారని ఏపీలో పలు కేసులు నమోదు అయిన దృష్ట్యా పోసానిని పోలీసులు అరెస్టు చేశారు.
