సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్, సినీనటుడు పోసాని కృష్ణమురళి ఫై ఒకటి కి మరొకటి కొత్త కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో మరోసారి హైకోర్టులో ఉపశమనం లభించింది. గుంటూరు జిల్లా పట్టాభిపురం, అల్లూరిజిల్లా పాడేరు, పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ పోలీసులు నమోదు చేసిన కేసులలో పీటీ వారెంట్లు అమలు కానందున పోసాని విషయంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత(బీఎన్‌ఎస్ఎస్) చట్టంలోని సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. అలాగే విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలు చేసి పోసానిని అదుపులోకి తీసుకున్నందున ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు విశాఖ వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసుపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు, కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు.
